టాలీవుడ్ లో చాలా తక్కువ టైం లోనే మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి అందరికీ తెలిసిందే. తాను మొదటి సినిమా నుండి రేపు విడుదల కానున్న "విన్నర్ భాగ్యము విష్ణు కథ" వరకు అన్నిటిలోనూ ప్రాణం పెట్టి కష్టపడ్డాడు. కానీ వివిధ కారణాల వలన హిట్ శాతం చాలా తక్కువ అయింది. అందుకే ఇంకా టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి సమయం తీసుకుంటున్నాడు. కిరణ్ అబ్బవరం చివరగా నటించిన మూడు సినిమాలు "సెబాస్టియన్ పీసీ 254 ", "సమ్మతమే" మరియు "నేను మీకు బాగా కావాల్సినవాడిని" ప్లాప్ కావడంతో ఒక్కసారిగా తన కెరీర్ ఏమవుతుందో అని అభిమానులు , ఇండస్ట్రీ వర్గాలు చాలా ఆందోళన చెందుతున్నారు.

కానీ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ప్లాప్ లు అవుతున్నా వరుస ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఈ ఆఫర్ లు అస్తమానం వస్తాయి అనుకుంటే పొరపాటే అవుతుంది. అందుకే తనకు ఖచ్చితంగా హిట్ కావాలి.. అప్పుడే బౌన్స్ బ్యాక్ అవుతాడు, లేదంటే టాలీవుడ్ మరో టాలెంటెడ్ నటుడి సినిమాలను చూసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. రేపు థియేటర్ లలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన వినరో భాగ్యము విష్ణుకథ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అబ్బూరు మురళి కిషోర్ అనే కొత్త డైరెక్టర్ పనిచేయడం విశేషం.

ఈ సినిమాపై పాజిటివ్ బజ్ లేకున్నా ట్రైలర్ మరియు టీజర్ లు ఆకట్టుకోవడం ఒక్కటే ఆశ. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కెరీర్ గాడిన పడాలంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యి తీరాలి. ఎప్పటిలాగే సినిమా యూనిట్ అంతా మూవీపై పూర్తి విశ్వాసంతోనే ఉన్నారు. సినిమా కథ కూడా కొత్తగానే ఉంది... అయితే దర్శకుడు టేకింగ్ మరియు స్క్రీన్ ప్లే మీదనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే రేపు కిరణ్ అబ్బవరం కు ఒక అగ్నిపరీక్ష అని చెప్పాలి. ఇది కనుక ఫెయిల్ అయితే ఈ క్రేజీ హీరో కనుమరుగైపోవడం ఖాయం. మరి ఈ అగ్నిపరీక్షలో కిరణ్ అబ్బవరం గెలుస్తాడా లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: