టాలీవుడ్ స్టార్ హీరో ఐనా మెగాస్టార్ చిరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి అడ్డు లేకుండా వరుస మూవీస్  చేస్తూ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ అందిస్తున్నారు.

ఇటీవల చిరు వరుసగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో ఆడియన్సెస్  ముందుకు వచ్చి వరుసగా రెండు హిట్స్ వెంటవెంటనే అందుకున్నాడు.ఐతే ఇక ఈ సినిమాల తర్వాత వెంటనే మరో సినిమాను కూడా విడుదల చేసేందుకు మెగాస్టార్ సన్నాహాలు చేస్తున్నాడు.

ఐతే మెగాస్టార్ చేస్తున్న లేటెస్ట్ మూవీ  'భోళా శంకర్'.. ఈ మూవీ ను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు.ఇక ఈ మూవీ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఐతే ఈ మూవీ తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా వస్తుంది.

మూవీ రీమేక్ సినిమా అయినా కూడా ఈ సినిమాపై ఒక రేంజ్ లో  అంచనాలు నెలకొన్నాయి. మెహర్ రమేష్ సాలిడ్ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ ను తెరకెక్కిస్తున్నాడు.దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఐతే ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ పై అదిరిపోయే అప్డేట్ కూడా వచ్చింది. లేటెస్టుగా  ఈ సినిమా రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతుంది. మనకున్న  సమాచారం ప్రకారం ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది. మొదట్లో ఈ మూవీ ను ఏప్రిల్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ఫిక్స్ చేయగా అది కాస్త  ఒక్కో నెల మారుతూ వస్తూ చివ్రగా ఆగస్టు కి వెళ్ళింది.ఐతే ఇది కూడా ఎంత వరకు నిజం అనేది మనకు దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ అసలు విషయం తెలీదు అంటున్నారు నేటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: