కే జి ఎఫ్.. ఈ సినిమా పేరు వినిపించింది అంటే చాలు సినీ ప్రేక్షకులు అందరికీ కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఆ రేంజ్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఇక మొదటి సినిమానే సూపర్ హిట్ అయింది అనుకుంటే ఇక దీనికి సీక్వెల్ గా వచ్చిన రెండో సినిమా అయితే అంతకుమించిన విజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది అని చెప్పాలి. గోల్డ్ మైనింగ్ మాఫీయా అనే కాన్సెప్ట్ తో  ఈ సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఈ సినిమా స్ఫూర్తితోనే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నది తెలుస్తుంది.


 వర్సటైల్ యాక్టర్ ఉపేంద్ర, అందాల ముద్దుగుమ్మ శ్రియ జంటగా నటించిన చిత్రం ఇది. ఇందులో సుదీప్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు అని చెప్పాలి. ఇక ఇటీవల నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. కాగా కనడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఇకపోతే చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించింది చిత్ర బృందం. ఈ మీడియా సమావేశంలో దర్శకుడు చంద్రు మాట్లాడుతూ.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇది 1970 ప్రాంతంలో జరిగే గ్యాంగ్ స్టార్ కథ చిత్రం అంటూ చెప్పుకొచ్చారు. కే జి ఎఫ్ సినిమా చూసి తను ఫిదా అయ్యాను. కే జి ఎఫ్  సినిమాను స్పూర్తిగా కథను సిద్ధం చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటివరకు 11 చిత్రాలకు దర్శకత్వం వహించాను అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇక ఉపేంద్ర అంటే తనకు ఎంతో అభిమానం అని.. ఇక ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ శ్రేయ పాత్రకి ప్రాణం పోసిందంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే సుదీప్ పాత్ర చిన్నది అయినప్పటికీ ఇక కథలో కీలకమైన పాత్ర అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా కేజిఎఫ్ సినిమా స్ఫూర్తితోనే ఈ సినిమాను తెరకెక్కించామని చెబుతూ ఉండటం.. ఇక ఈ సినిమాలోని పాత్రలకు సంబంధించిన లుక్స్ కూడా కేజిఎఫ్ సినిమాల్లో తరహా లోనే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: