రెండున్నర దశాబ్దాల క్రితం ‘ప్రేమకథ’ సినిమాతో సుమంత్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికి చాలా సినిమాల్లో ఆయన నటించాడు. కానీ వాటిలో విజయం సాధించిన చిత్రాలను మాత్రం కేవలం చేతి వేళ్ళ మీద లెక్కపెట్టాల్సిందే.అలాంటి సీనియర్ సుమంత్… ఇప్పుడు హీరోగా ఓ పక్క చేస్తూనే ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మారిపోయాడు. ఆ మధ్య ఎన్టీఆర్ బయోపిక్ లో తన తాతయ్య అక్కినేనిగా అతిథి పాత్రలో మెరిసిన హీరో సుమంత్ ఇంకా గత సంవత్సరం వచ్చిన ‘సీతారామం’ మూవీలో కీ-రోల్ ప్లే చేశాడు. అతని పోషించిన బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్ర గురించి మూవీ రిలీజ్ కు ముందు దర్శక నిర్మాతలు చాలా బాగా ప్రచారమే చేశారు. కానీ అది నెగెటివ్ రోల్ అనేది మాత్రం రివీల్ చేయకుండా దాన్ని చాలా తెలివిగా దాచిపెట్టారు. వెండితెర మీద సుమంత్ పాత్రలోని నెగెటివ్ షేడ్స్ చూసి ఆడియెన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. సుమంత్ ఇలాంటి పాత్ర చేశాడేమిటీ అని సినిమా ప్రేక్షకులు చర్చించుకోవడం మొదలెట్టారు.అయితే అదే అతనికి ప్లస్ అయ్యింది. సుమంత్ ను ఈ తరహా పాత్రలో ఊహించలేదని అనేకమంది అనడంతో అతని పాత్రపై ఫోకస్ మరింత పెరిగింది.‘సీతారామం’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం వల్ల కావచ్చు… తాజాగా వచ్చిన ‘సార్’ సినిమాలో కూడా సుమంత్ ఓ కీ-రోల్ ప్లే చేశాడు.


 అయితే ఈ విషయాన్ని కూడా దర్శక నిర్మాతలు చాలా రహస్యంగా ఉంచేశారు. ఎంతలా అంటే అసలు సుమంత్ ఈ సినిమాలో నటించిన విషయం కూడా ఎక్కడా లీక్ కాలేదు. తెర మీద ఎ. ఎస్. మూర్తి అనే కడప కలెక్టర్ క్యారెక్టర్ లో సుమంత్ ను చూడగానే ఆడియెన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంకా దానికి తోడు క్లయిమాక్స్ లో ఆ పాత్రను రివీల్ చేసిన తీరు కూడా అందరినీ సూపర్ గా ఆకట్టుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరి అయితే ఈ పాత్రను చాలా చక్కగా ప్రెజెంట్ చేశాడు.ఓ రకంగా ఇలాంటి క్యారెక్టర్స్ కు సుమంత్ ఒప్పుకొని మరిన్ని సినిమాలు చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వీటివల్ల అతనికి చాలా మంచి పేరు వస్తుంది.ఆయనకి సోలో హీరోగా హిట్ వచ్చి దాదాపు నాలుగైదేళ్ళు అవుతోంది. ‘మళ్ళీ రావా’ సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని సుమంత్ అందుకోలేదు.దాంతో అందరూ ఆయన్ని మర్చిపోయారు. కానీ ఇలాంటి రోల్స్ వల్ల సుమంత్ కి మంచి క్రేజ్ వస్తుంది.సుమంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సీతారామమ్ ఇంకా సార్ రెండు పెద్ద సూపర్ హిట్ లు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: