తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన సార్ మూవీ అంచనాలకు మించి విజయం సాధించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుంది.మంచి కంటెంట్ తో తెరకెక్కితే భాషా భేదం లేకుండా ఏ సినిమా అయినా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఈ సినిమా ప్రూవ్ చేసింది.అయితే ఈ సినిమాను ఓ టాలీవుడ్ స్టార్ హీరో రిజెక్ట్ చేసాడట. ఆ హీరో ఎవరో కాదు. అతనే న్యాచురల్ స్టార్ నాని. ఇప్పుడు ఈ టాపిక్ నెట్టింటా హాట్ టాపిక్ అవుతోంది. సార్ సినిమా దర్శకుడు వెంకీ అట్లూరి నానికి ముందుగా ఈ సినిమా కథను వినిపించారని అయితే నాని మాత్రం ఈ సినిమాను రిజెక్ట్ చేశారని సమాచారం తెలుస్తుంది.ఇక ఆ తర్వాత వెంకీ అట్లూరి ధనుష్ ను సంప్రదించడం ఆయన ఒప్పుకొని చెయ్యడం ఇక ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించడం జరిగిపోయాయి.


ఇక సార్ మూవీ నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తోందని సమాచారం తెలుస్తుంది. సితార నిర్మాతలు ఈ సినిమా కలెక్షన్లతో చాలా వరకు సేఫ్ అయ్యారని సమాచారం తెలుస్తుంది. బడ్జెట్ తో పోల్చి చూస్తే చాలా ఎక్కువ మొత్తంలోనే కలెక్షన్లు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే తమిళంలో ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా అంచనాలకు మించి మంచి కలెక్షన్లను సాధించిందని సమాచారం తెలుస్తోంది.ఇక ఇప్పుడు వెంకీ వల్ల టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది కోలీవుడ్ డైరెక్టర్లు కూడా తెలుగులో సినిమాలు తీసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. వంశీ పైడిపల్లి విజయ్ కు వారసుడు సినిమాతో టాక్ తో సంబంధం లేకుండా ఫైనల్ గా హిట్ ఇవ్వగా వెంకీ అట్లూరి ధనుష్ కు సార్ మూవీతో గుర్తుండిపోయే సూపర్ హిట్ ని ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: