టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డార్లింగ్ అన్ని భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నాడు. వాటిలో ఓ చిన్న సినిమా కూడా ఉంది. అదే మారుతీ తో చేస్తున్న ప్రాజెక్ట్. ప్రభాస్, మారుతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుని అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే అప్పుడే షూటింగ్ కూడా చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందని.. ఓ పాడుబడ్డ థియేటర్ చుట్టూనే ఈ సినిమా కథ తిరుగుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఓ పాత కాలపు థియేటర్ సెట్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. 

ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఇప్పటివరకు ఏకంగా ఈ సినిమా మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అయితే ఓ పక్క సినిమా షూటింగ్ జరుగుతున్నా.. సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల డార్లింగ్ ఫ్యాన్స్ మూవీ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ మారుతి సినిమాను ప్రకటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాని అఫీషియల్ గా ప్రకటించకపోవడం పై ఒక కారణం ఉందని లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే..

ఇప్పటికే ఆడియన్స్ ముందుకు రావలసిన ఆది పురుష్ మూవీ రిలీజ్ ఆలస్యం అవడంతో ప్రభాస్ తన మిగిలిన సినిమాల నుంచి కూడా అప్డేట్స్ని హోల్డ్ లో పెడుతున్నారట. జూన్ 16న ఆది పురుష్ విడుదలకు సిద్ధమవుతుంది. అప్పటివరకు మారుతి సినిమా షూటింగ్ ఇలాగే కొనసాగుతుందని అంటున్నారు. జూన్ 16 తర్వాత మారుతి - ప్రభాస్ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఇందుకోసం ఇప్పటికే తాజాగా ప్రభాస్ తో ఫోటోషూట్ కూడా చేయించారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మిస్తుండగా.. సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: