
ఐతే యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కు తోన్న ఈ సినిమా కు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ తో నయనతార ఫుల్ బిజీగా ఉంది. జవాన్ తర్వాత నయనతార సినిమాల కు లాంగ్ బ్రేక్ తీసుకోనున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
ఐతే గత ఏడాది అక్టోబర్ లో సరోగసీ ద్వారా కవలల కు జన్మ నిచ్చింది నయనతార. పెళ్లయిన ఐదు నెలల కే కవల పిల్లలకు తల్లి కావడం వివాదాని కి దారితీసింది. తమకు ఆరేళ్ల క్రితమే పెళ్లయిందంటూ మ్యారేజ్ సర్టిఫికెట్‌ను చూపించి లీగల్‌గా నే వివాదాని కి ముగింపు పలికారు నయనతార, విఘ్నేష్‌శివన్. పిల్లల బాధ్యత కారణం గా కొన్నాళ్లు యాక్టింగ్ కు దూరం గా ఉండాల ని నయనతార నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపి స్తున్నాయి.
నటన కు బ్రేక్ ఇచ్చి కుటుంబ బాధ్యత లతో పాటు పాటు తమ ఓన్ ప్రొడక్షన్ హౌజ్ రౌడీ పిక్చర్స్ కు సంబంధించిన వ్యవహారాల పై దృష్టిసారించాలనే ఆలోచన లో నయన్ ఉన్నట్లు సమాచారం. అందు కే ఆమె కొత్త సినిమా లపై సంతకం చేయడం లేదని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం అంగీకరించిన సినిమా ల్ని పూర్తి చేసే పని లో నయన్‌ఉందని అంటున్నారు.
షారుఖ్‌ఖాన్ జవాన్ తో పాటు తమిళంలో ఇరైవన్ అనే మూవీస్ చేస్తోంది నయనతార. ఈ రెండు తప్ప మరే సినిమాపై నయనతార సంతకం చేయలేదని అంటున్నారు. జవాన్ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ లో విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక పాత్రలు చేస్తూ న్నారు.