సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్ .అనంతరం మలయాళం లో ఒక సినిమాలో హీరోయిన్ గా తన కెరీర్ను మొదలుపెట్టి టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.తన అంద చందాలతో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది కీర్తి సురేష్. అప్పట్లో హీరోయిన్ లకి తీవ్రమైన పోటీ ఉండేది. ఇక అలాంటి సమయంలో కూడా కీర్తి సురేష్ ఎటువంటి స్కిన్ షో చేయకుండా నటించి మంచి విజయాలను దక్కించుకుంది. అనంతరం వరుస సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ తన గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతుంది. కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కీర్తి సురేష్ కెరియర్ గ్రాఫ్ ఇప్పుడు కాస్త తగ్గింది 

అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటి వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ సినిమా తర్వాత వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది. ఆ సినిమాలతో పాటు పలు రకాల సినిమాలు చేసినప్పటికీ తను చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాపులు అందుకున్నాయి. గత ఏడాది ఆమె నటించిన సర్కార్ వారి పాట సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ టాలీవుడ్ లో మాత్రం ఆమెకి అవకాశాలు రాలేదు. అనంతరం చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది కీర్తి సురేష్. ఈ సినిమాతో పాటు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో చెల్లెలి పాత్రలో నటిస్తుంది .ఇంతకాలం తర్వాత ఇద్దరు స్టార్ హీరోల సినిమాలలో కీర్తి సురేష్ నటించి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుంది

అని తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. భోళాశంకర్ సినిమాపై కంటే నాని నటిస్తున్న దసరా సినిమాపైనే అందరూ ఎంత నమ్మకంగా ఉన్నారు. ఇక దసరా సినిమాలో కీర్తి సురేష్ డి గ్లామర్ రోల్ లో కనిపించనుంది.అభిమానులతో పాటు తాను కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉంది. ఈ క్రమంలోనే దసరా సినిమా రిజల్ట్ చూసి కొత్త సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట కీర్తి సురేష్. అంతేకాదు దసరా సినిమా ఏ స్థాయిలో సక్సెస్ను అందుకుంటుందో దాన్నిబట్టి కీర్తి సురేష్ తన తదుపరి సినిమాలలో పాత్రుల ఎంపిక మరియు పారితోషకం వంటి విషయాలపై నిర్ణయాన్ని తీసుకోవాలని చూస్తుందట. ఈ క్రమంలోనే ఇటీవల ఒక దర్శకుడు కీర్తి సురేష్ ని సంప్రదించారట. ఇక ఆ సమయంలో తనకి కాస్త సమయం కావాలని ఆదర్శకుడిని అడిగిందట కీర్తి సురేష్. దసరా సినిమా విడుదలైన తర్వాత తన నిర్ణయాన్ని చెబుతాను అంటూ స్పష్టం చేసిందట కీర్తి సురేష్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: