పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా మరో సినిమా చేస్తున్నాడు. తమిళ సినిమా వినోదయ సీతం ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. తమిళంలో ఆ సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖనినే తెలుగులో డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు కూడా త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరం తేజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్సినిమా కోసం కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు అందుకు భారీ పారితోషికం కూడా అందుకుంటున్నాడట.

పవన్ కళ్యాణ్ వినోదయ సీతం రీమేక్ కోసం 80 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. అంటే రోజుకి 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. 20 రోజులు 80 కోట్లు ఇదే నిజమైతే మాత్రం ఇండియన్ సినీ పరిశ్రమలో అతి తక్కువ కాల్ షీట్ తో భారీ రెమ్యునరేషన్ అందుకునే హీరోగా పవన్ కళ్యాణ్ రికార్డ్ సృష్టిస్తాడని చెప్పొచ్చు. క్రిష్ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా పూర్తి చేయాల్సి ఉండగా దానితో పాటుగా హరీష్ శంకర్ సినిమా కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాల్సి ఉంది.

సుజిత్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు పవన్. ఇలా 3, 4 సినిమాల దాకా లైన్ లో ఉండగా పవన్ మాత్రం తనకు అవకాశం ఉన్నప్పుడే షూటింగ్ చేస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కల్లా కమిటైన సినిమాలను పూర్తి చేసేలా పవర్ స్టార్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ అనుకున్న విధంగా సినిమాలను పూర్తి చేస్తారా లేదా అన్నది చూడాలి. పవర్ స్టార్ సినిమాలను చూసేందుకు ఫ్యాన్స్ ఎప్పుడు ఎగ్జైటింగ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: