PS2 : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్టు అయిన 'పొన్నియిన్ సెల్వన్' రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి భాగం గత సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోని ఘన విజయం సాధించింది.మిగతా భాషల్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా తమిళంలో మాత్రం ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఈ సినిమా రెండు భాగాలు కలుపుకుని  రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తే.. మొదటి భాగమే ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.తెలుగులో ఈ సినిమాకి ప్లాప్ టాక్ వచ్చింది.. అయితే టెక్నికల్ గా ఈ మూవీ బాగుంది అని కొంతమంది చెప్పడంతో తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ సాధించి తరువాత డీసెంట్ హిట్ గా నిలిచింది.ఇక 'పొన్నియన్ సెల్వన్ -1' ను చూసిన వారంతా కూడా 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఈ క్రమంలో 'పొన్నియన్ సెల్వన్ 2' చిత్రాన్ని 2023, ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్టు సమాచారం వినిపిస్తుంది.షూటింగ్ పూర్తయినప్పటికీ.. ఈ సినిమా ప్యాచ్ వర్క్ కోసం మణిరత్నం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారట.'పొన్నియన్ సెల్వన్-1' హిట్ అవ్వడంతో 'పీఎస్-2' పై చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి.అందుకే ఏమాత్రం ఎక్కడా రాజీ పడకుండా.. ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా ఈ సినిమాని తీర్చిదిద్దాలని మణిరత్నం ఎక్కువ టైం తీసుకుంటున్నట్టు స్పష్టమవుతుంది. అయితే తమిళంలో తప్ప 'పీఎస్-1' మిగిలిన భాషల్లో 'కాంతార' సినిమాలాగా భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది.అంతేకాదు రెహమాన్ సంగీతం అందించిన పాటలు కూడా అంతగా మెప్పించలేకపోయాయి.అన్ని కరెక్ట్ గా సెట్ చేసుకొని వచ్చే సెప్టెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: