సినీ ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చిన నేచురల్ స్టార్ నాని అనుకోకుండా హీరో అయిపోయాడు. క్లాప్ అసిస్టెంట్ గా కెరీర్ ని ప్రారంభించిన నాని.. అనుకోని విధంగా 'అష్టాచమ్మా' అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే తన సహజ నటనతో ఆకట్టుకొని వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే నాని తన కెరీర్లో అనుకోని కారణాలవల్ల కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నాడు. వాటిల్లో సక్సెస్ సాధించిన సినిమాలు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఒకసారి నాని మిస్ చేసుకున్న సినిమాల లిస్టును పరిశీలిస్తే.. 

రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన 'ఉయ్యాల జంపాల' సినిమాలో ముందుగా నానికే హీరోగా అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అది మిస్ అయింది. ఆ తర్వాత నితిన్ నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే, సాయి ధరమ్ తేజ్ నటించిన 'సుప్రీం' వంటి సినిమాలు కూడా నాని మిస్ చేసుకున్నాడు. తర్వాత నాగచైతన్య తడాఖా, ఆది సాయికుమార్ నటించిన సుకుమారుడు వంటి సినిమాలను కూడా నాని రిజెక్ట్ చేశాడు. ఇక నాగార్జున కార్తీక్ కాంబినేషన్లో వచ్చిన ఊపిరి సినిమాలో కార్తీ ప్లేస్ లో మొదట నాని కే ఛాన్స్ రాగా.. దాన్ని వదిలేసుకున్నాడు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాలో అక్కినేని నాగేశ్వరావు గారి పాత్రకు మొదట నానికే ఛాన్స్ వచ్చినా..

ఎందుకనో ఆ రోల్ ను నాని చేయలేదు. శర్వానంద్ నటించిన శ్రీకారం, జాను వంటి సినిమాలను కూడా నానినే మొదట హీరోగా ఎంచుకోగా.. పలు కారణాల వల్ల ఆ సినిమాల్లో నటించలేదు. ఇక గత ఏడాది హను రాఘవపూడి తెరకెక్కించిన సెన్సేషనల్ లవ్ స్టోరీ 'సీతారామం' సినిమాలో దుల్కర్ సల్మాన్ కంటే ముందు హీరోగా నానిని అనుకున్నారు. కానీ ఆ అవకాశాన్ని కూడా నాని మిస్ చేసుకున్నాడు. ఇలా నాని మిస్ చేసుకున్న సినిమాల్లో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకోవడం విశేషం. ఇక ప్రస్తుతం నాని 'దసరా' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: