పుష్ప తర్వాత కెరీర్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడు అల్లు అర్జున్. పుష్పతో పాన్ ఇండియా అటెంప్ట్ చేయగా అక్కడ ఊహించని విధంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలో పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్ నేషనల్ వైడ్ సినిమాలను చేయాలని చూస్తున్నాడు. ఆ క్రమంలోనే అల్లు అర్జున్ 31వ సినిమాను సందీప్ వంగ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అర్జున్ రెడ్డితో సత్తా చాటిన డైరెక్టర్ సందీప్ అదే సినిమా హిందీలో కూడా తీసి హిట్ కొట్టాడు.

రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్న సందీప్ వంగ ఇప్పటికే ప్రభాస్ తో స్పిరిట్ ఎనౌన్స్ చేశాడు. స్పిరిట్ తెరకెక్కకముందే అల్లు అర్జున్ తో సినిమా లైన్ లో పెట్టాడు. అసలైతే అర్జున్ రెడ్డి కథను ముందు సందీప్ బన్నీకే చెప్పాడట. ఆయన అప్పుడు ఎందుకో సందీ మీద అంత నమ్మకం పెట్టలేకపోయాడు. అలా అల్లు అర్జున్ మిస్ అయిన ఆ ఛాన్స్ విజయ్ దేవరకొండ కొట్టేశాడు. అతను స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ రెడ్డి సినిమాను అల్లు అర్జున్ చేస్తే రిజల్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని చెప్పొచ్చు.

ఇక ఆ సినిమా మిస్సైనా సందీప్ తో తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. ఓ విధంగా బన్నీ పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. యానిమల్ కూడా సందీప్ మార్క్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. తప్పకుండా ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలతో అతను పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి బన్నీతో సందీప్ ఎలాంటి సినిమా చేస్తాడో అని అల్లు ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రేక్షకులు కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇక మీదట బన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో వరుసగా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: