
సమంత గడచిన కొన్ని నెలల నుంచి మయోసైటీస్ వ్యాధి బారిన పడ్డ సంగతి తెలిసిందే. రామానాయుడు అనే వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రానా ఇందులో వెంకటేష్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్ కు రీమిక్కుగా కరణ్ అన్షూయన్,సువర్ణ వర్మ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ప్రయాగంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రానా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. సమంత ఆరోగ్యం గురించి మాట్లాడుతూ తన వ్యక్తిగత సమస్య గురించి బహిరంగంగా చెప్పినప్పుడు నటీనటులు ప్రజలు గొంతుకగా మారగలరా ప్రశ్నించగా..
ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయం అనేది ఉంటుంద. ప్రతి ఒక్కరు దానిని ఎలా మాట్లాడగలరు మిగతావారు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందనేది ముఖ్యమన్నారు రానా. సమంత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియగానే నేను ఆమెను సంప్రదించడం జరిగింది మేము ఎప్పుడు మాట్లాడుకుంటాము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు అనేవి సాధారణంగా ఉంటాయి..ఎవరి జీవితం సాఫీగా సాగదు.. ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేది ఒకటి ఉంటుంది..అది ఆరోగ్య సమస్య కావచ్చు అలాంటి సమయంలో మనం ఎలా వ్యవహరించాలి.. ఎలా స్పందిస్తాం అనేది ఈ సమస్యల గురించి అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.