భాషతో సంబంధం లేకుండా ఆన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ హీరోయిన్గా మంచి పేరు పొందింది హీరోయిన్ అదితి రావు హైదరి. నవాబ్, వి, పోన్నియిన్ సెల్వన్ , సముద్రం వంటి చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి నటుడు సిద్ధార్థ్ తో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పైన ఈ ముద్దుగుమ్మ స్పందించినట్లు తెలుస్తోంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


అదితి రావు హైదరి.. తాజ్ డివైడెడ్ బై బ్లడ్ అనే వెబ్ సిరీస్లో అనార్కలి పాత్రలో నటిస్తోందట .ఇది zee -5లో స్ట్రిమింగ్ అవుతోంది ప్రమోషన్లలో భాగంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. హీరో సిద్ధార్థ్ తో సహజీవనం చేస్తున్నారని గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి.. అందుకు బలం చేకూర్చే విధంగా ముంబైలో ఎన్నోసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు. అంతేకాకుండా హీరో శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా జోడిగా వెళ్లడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి డాన్స్ వేస్తున్నటువంటి ఒక వీడియోను షేర్ చేయడంతో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని ప్రేక్షకులు బలంగా నమ్మారు.


అయితే ఈ విషయంపై అతిధి స్పందిస్తూ ఇలాంటి రూమర్స్ కు నేను ప్రాధాన్యత ఇవ్వను నేను పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాననీ  తెలుపుతూ..అందువల్ల ఇలాంటి వాటిని అసలు పట్టించుకోను ప్రజలు ఎల్లప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అందరి నోళ్లను మనం మూయలేము కథ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కేవలం నాకు ఆసక్తి కలిగిన పనిని మాత్రమే చేస్తున్నానని తెలుపుతోంది. ప్రస్తుతం నాకు ఇష్టమైన డైరెక్టర్ తో నేను పని చేస్తున్నాను అంటూ తెలిపింది. నా డైరెక్టర్ కోరుకున్న విధంగా కనిపించడానికి చాలా ఇష్టపడతాను అంటూ తెలిపింది. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే పలు ప్రాజెక్టులతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: