టాలీవుడ్ టాప్ హీరో ఐనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఐతే ఈ మూవీ తో పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్.ఐతే దీని తర్వాత ఎన్టీఆర్ ఇంత వరకు సినిమాను స్టార్ట్ చేయలేదు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమాను ప్రకటించాడు.

ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ వంటి హిట్ సినిమా వచ్చింది. ఈ సినిమాతో ఎన్టీఆర్, కొరటాల ఇద్దరు ఫ్యాన్స్ ను ఆకట్టు కున్నారు అనే చెప్పాలి. ఇక ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఈ మూవీ పై అంచనాలు బాగా పెంచుకున్నారు. అయితే కొరటాల సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళక పోవడంతో తారక్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ఆచార్య వంటి డిజాస్టర్ వచ్చిన కూడా కొరటాల మీద ఉన్న నమ్మకంతో తారక్ ఈయనకే అవకాశం ఇచ్చాడు. అందుకే కొరటాల స్క్రిప్ట్ ను మరింత జాగ్రత్తగా రాసుకుంటున్నాడు అని టాక్. ఇక తాజాగా ఈ సినిమా కోసం కొరటాల అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడని ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ కంపోజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని తాజాగా టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.ఎన్టీఆర్ ఆస్కార్ వేడుక నుండి వచ్చాక అప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. పాన్ ఇండియన్ మూవీగా చిత్రికరించబడుతున్న ఈ మూవీ ను యువ సుధా ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు భారీగా స్థాయిలో నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేసారు అలాగే ఆమె ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు చిత్ర బృందం. ఐతే జాన్వీ మొదటిసారి టాలీవుడ్ లో ఏంట్రీ ఇవ్వబోతుంది అది కూడా యంగ్ టైగర్ సినిమాతో కాబట్టి ఒక రేంజ్ లో అభిమానులు ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: