ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు శ్రీలీల రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి అనే సినిమా ద్వారా ఈ అమ్మడు హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక మొదటి సినిమాతో తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో జోడి కట్టి గత ఏడాది ధమాకా అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేసింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత శ్రీ లీలా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.


 ఈ అమ్మడు అందం అభినయంలోనే కాదు నటనలో డాన్సులు చేయడంలో కూడా తోపు అన్న విషయం అర్థం చేసుకున్న ఎంతో మంది దర్శకులు వరుసగా అవకాశాలు ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రామ్ పోతినేని సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలయ్య సినిమాలో కూడా ప్రేక్షకులను పలకరించబోతుంది అన్న విషయం తెలిసిందే. మహేష్ బాబు సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ సొగసరి. అయితే ఇక పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేయడంతో ఈ అమ్మడి పేరు ఇండస్ట్రీలో మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే ఇక పవన్ కళ్యాణ్ సినిమా ద్వారా ఒకప్పుడు శృతిహాసన్ కెరియర్ మలుపు తిరిగినట్లు ఇక ఇప్పుడు శ్రీలల కెరియర్ కూడా ఒక్కసారిగా టాప్ లోకి వెళ్ళిపోవడం ఖాయమని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు హరిశంకర్ పవర్ స్టార్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శృతిహాసన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన శ్రీ లీలకు  ఛాన్స్ దక్కింది. దీంతో ఇక శ్రీ లీల  కెరియర్ ఒక్కసారిగా టర్న్ అయ్యి ఇండస్ట్రీలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: