మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇప్పటికే అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ ని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో సునీల్ ... అంజలి ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. కొంత కాలం క్రితమే ఈ మూవీ యూనిట్ న్యూజిలాండ్ లో ఈ మూవీ కి సంబంధించిన ఒక పాటను మరియు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. న్యూజిలాండ్ లో ఈ మూవీ యూనిట్ చిత్రకరించిన పాట మరియు సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది.

మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ మూవీ కి ఈ చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఆర్ సి 15 అనే టైటిల్ తో ఈ మూవీ యొక్క చిత్రీకరణను ఈ మూవీ యూనిట్  ప్రస్తుతం జరుపుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క టైటిల్ టీజర్ ను మార్చి 26vవ తేదీన విడుదల చేయడానికి ఈ సినిమా బృందం సన్నాహాలు చేస్తున్నట్లు ... అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: