పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు వరుస మూవీ లకు కమిట్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు మూవీ లో నిది అగర్వాల్ ... పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను ... సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతం రీమేక్ మూవీ లోను ... యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓ జి మూవీ లోను నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అయిన పవన్ కళ్యాణ్ ఒక మూవీ షెడ్యూల్ ముగిసిన తర్వాత మరో మూవీ కి డేట్స్ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే పవన్ ... హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ కు కొన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ కేటాయించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షెడ్యూల్ పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ ... సుజిత్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి పది రోజులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ పది రోజుల్లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను "ఓ జి" మూవీ యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: