పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ను ప్రారంభించి చాలా కాలం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ కొంత భాగం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" మూవీ షూటింగ్ లో పాల్గొనడంతో ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు నిలిచి పోయింది. ఆ తర్వాత కొంత కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ ను తిరిగి పవన్ ప్రారంభించారు. కాకపోతే ఇప్పటికీ కూడా ఈ మూవీ షెడ్యూల్ లు ఫుల్ స్పీడ్ లో జరగడం లేదు.

కాకపోతే మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ కి పవన్ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి తో ఈ సినిమా మొత్తం షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయడానికి ఈ సినిమా బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నీది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ పూర్తి కాక ముందే పవన్ కళ్యాణ్ ... సముద్ర ఖని దర్శకత్వంలో వినోదయ సీతం అనే రీమేక్ మూవీ లో నటించడానికి ... హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో నటించడానికి ... సుజిత్ దర్శకత్వంలో ఓ జి అనే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 5 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు పవన్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ కి డేట్స్ ఇచ్చినట్లు ... ఈ పది రోజుల్లో ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సుజిత్ దర్శకత్వంలో రూపొందే ఓ జి మూవీ కి 10 రోజులు పవన్ కేటాయించనున్నట్లు ... ఈ 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ మూవీ యూనిట్ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే వినోదయ సీతం మూవీ కి కూడా మరికొన్ని రోజులను కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇలా పవన్ వరుసగా సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: