
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రానా నాయుడు ఈ వెబ్ సిరీస్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు.
వెంకటేష్ తో కలిసి నటించటం మరియు ఈ సీరీస్ గురించి మాట్లాడిన రానా ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోంది అనే విషయంపై మాట్లాడుతూ రానా అభిమనులను హెచ్చరించాడు. "విక్టరీ వెంకటేష్ సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా టికెట్లు కొనేసుకుని సంక్రాంతి వెకేషన్ కి వెళ్ళినట్టు వెళ్తారు. కానీ రానా నాయుడు షో మాత్రం అలా చూడకండి. విడివిడిగా చూడండి. కలిసి చూస్తే కంగారు పడతారు," అని రానా డైలాగ్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఆయన ఎందుకు అలా అన్నారో ఇంకా నేటిజన్ల కి సరిగ్గా క్లారిటీ లేదు.
ఇక రానా మరియు వెంకీ లతో పాటు ఈ వెబ్ సిరీస్ లో సుచిత్ర పిళ్ళై, గౌరవ్ చోప్రా, సువ్రీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మరి వెంకటేష్ మరియు రానాలను ఒకేసారి బుల్లితెర మీద చూడడానికి ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దగ్గుబాటి అభిమానులకు ఈ వెబ్ సిరీస్ ఎంతవరకు నచ్చుతుందో వేచి చూడాలి.
ఏదేమైనా వెంకటేష్ మరియు రానా ఎవరి సినిమాల్లో వారు బిజీ గా ఉన్నప్పటికీ కూడా బుల్లితెర లో కూడా అలరించాలి అని ఎప్పటినుండో అనుకుంటున్నారు. ఐతే ఇన్నాళ్లకు వారి కోరిక నెరవేరింది అని వాళ్ళ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.