
ఇలా ప్రతిష్టాత్మకమైన మూవీగా నిలిచిన బాహుబలి సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. ముఖ్యంగా ఇక ఈ సినిమా అవకాశాన్ని కోల్పోయిన నటీనటులు గురించి ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే తాను కూడా బాహుబలిలో నటించిన అవకాశాన్ని కోల్పోయాను అంటూ చెబుతుంది గ్లామరస్ హీరోయిన్ రాసి కన్నా. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న రాశి కన్నా ఇప్పటివరకు తన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తన అందం అభినయంతో కుర్ర కారు మతి పోగొట్టింది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. బాహుబలిలో అవకాశం మిస్ అయిన విషయం గురించి మాట్లాడింది. బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి నేను కూడా వెళ్లాను. అయితే అందులో తమన్న పోషించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చాను. కానీ సుకుమారమైన ముఖం చేతిలో కత్తి ఉండడానికి రాజమౌళి సర్ యాక్సెప్ట్ చేయలేదు. ఆ పాత్రకు అందంతో పాటు రఫ్ లుక్ కూడా కావాలి. ఇక నేనైతే ప్రేమ కథలకే సరిపోతను భావించి నా స్నేహితుడు ఒకరు లవ్ స్టోరీ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళు.. అని కథ నీకు బాగా నచ్చుతుందని రాజమౌళి సర్ ఒక సలహా ఇచ్చారు అంటూ రాశి కన్నా చెప్పుకొచ్చింది.