నటుడు దర్శకుడుగా మారడం కొత్తేమీ కాదు. కానీ కమెడియన్లు కూడా డైరెక్టర్లుగా మారి మంచి విజయాలను అందుకుంటే అది నిజంగానే పెద్ద విషయమని చెప్పవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ లో ఇప్పటివరకు డైరెక్టర్ గా సక్సెస్ అయిన కమెడియన్ సైతం ఎవరూ లేరని కూడా చెప్పవచ్చు. కానీ ఈ రికార్డు ఇప్పుడు అందుకుంటున్నారు కమెడియన్ వేణు. బలగం సినిమాతో పైసలతో పాటు ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం కమెడియన్ వేణు హాట్ టాపిక్ గా మారుతున్నాడు.


దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంతో కమెడియన్ వేణు డైరెక్టర్ గా పరిచయమయ్యారు. కమెడియన్ వేణు నుంచి కామెడీ కథని అందరూ ఎక్స్పర్ట్ చేశారు. కానీ కన్నీరు తెప్పించే కథతో బలగం సినిమాను ఒక ఎమోషనల్ స్టోరీ తో కంటెంట్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు వేణు. తెలంగాణ నేపద్యంలో వచ్చిన బలగం సినిమాకి కలెక్షన్లతో పాటు ప్రశంసలు కూడా అందుకుంటున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1.15 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయడం జరిగింది దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.30 కోట్ల రూపాయల బరితో దిగింది ఇప్పటివరకు ఈ సినిమా రూ.2.40 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది.


దీంతో ఈ సినిమా మంచి హిట్ టాక్ ను అందుకుంది. దీంతో డైరెక్టర్గా అటు వేణు కూడా తన మొదటి ప్రయత్నాలతోనే సక్సెస్ గా మారి చరిత్రను సృష్టించారు. గతంలో వెన్నెల కిషోర్ జఫ్ఫా వెన్నెల వన్ అండ్ ఆఫ్ లాంటి సినిమాలతో డిజాస్టర్ గా మిగిలారు. సీనియర్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ కొడుకు భజంత్రీలు వంటి సినిమాలు తెరకెక్కించిన అవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక కృష్ణ భగవాన్ జాన్ అప్పారావు పార్టీ ప్లస్ సినిమాతో సక్సెస్ కాలేకపోయారు కానీ చివరికి వేణు మాత్రం సక్సెస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: