టాలీవుడ్ లో హీరోయిన్ నగ్మా గురించి ఈమె అందం గురించి గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక దశలో నగ్మా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.అలా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను కూడా ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా నగ్మా ఎఫైర్లు రొమాన్స్ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. తాజాగా నగ్మా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లుగా వార్తల వినిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సీనియర్ హీరోయిన్ నగ్మా సైబర్ నేరగాళ్ల చేతులో మోసపోయి తన మొబైల్ కి వచ్చిన మెసేజ్ ని క్లిక్ చేయడంతో అడ్డంగా బుక్ అయిపోయింది. ఫిబ్రవరి 28వ తేదీన నగ్మా మొబైల్ కి బ్యాంకు వాళ్లు పంపించినట్లుగా ఒక మెసేజ్ రావడం జరిగిందట అందులో ఉన్న లింకుని క్లిక్ చేయగా వెంటనే తన మొబైల్ కి ఫోన్ కాల్ వచ్చిందట. అలా బ్యాంకు ఎంప్లాయ్ గా పరిచయం చేసుకున్న ఒక మోసగాడు.. కేవైసీ పూర్తి చేయాలని చెప్పడంతో నగ్మా కూడా సరే అనిందట.


ఇక తర్వాత డీటెయిల్స్ ని షేర్ చేయకుండా కేవలం ఆన్లైన్ బ్యాంకు అకౌంట్లోనే లాగిన్ అయ్యి.. నగ్మా అకౌంట్ నుంచి ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆమె అకౌంట్ నుంచి దాదాపుగా లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు తెలుస్తోంది నేరగాడు లాగిన్ అయ్యే క్రమంలో ఎన్నో మల్టిపుల్ అటెంప్ట్ చేశారని తన మొబైల్ కి అనేక ఓటీపి లు వచ్చాయని తెలియజేస్తోంది నగ్మా. అయితే తన అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు పోకపోవడంతో నగ్మా కాస్త ఆనందాన్ని తెలియజేస్తుంది. నగ్మా అకౌంట్ నుండి ఒక నేషనల్ బ్యాంకుకు ₹1,00,000 ట్రాన్స్ఫర్ అయ్యాయి నగ్మా కస్టమర్ గా ఉన్న సేమ్ బ్యాంకులో దాదాపుగా 80 మంది కస్టమర్లు ఇదే తరహాలో మోసపోయినట్లుగా తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: