మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను నటుడుగా సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ , అంజలి కీలక పాత్రలలో కనిపించనుండగా ... నటుడి గా ... దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభమై ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ కి ఇప్పటివరకు టైటిల్ ను  ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ పొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క చిత్రీకరణను ఆర్సి15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క టైటిల్ ను ఈ సంవత్సరం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దానితో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయడం కోసం మూడు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో సీఈఓ ... సేనాపతి ... మరియు సైనికుడు అనే పేర్లను చిత్ర బృందం పరిశీలిస్తున్న తెలుస్తుంది. ఈ మూడు పేర్లలో చిత్ర బృందం ఎక్కువ శాతం "సీఈఓ" పేరు వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: