
కానీ ఇప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ పూర్తిగా పరువు తీసేసుకున్నాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది. గత కొంతకాలం నుంచి వెంకటేష్ సోలో హీరోగా రావడం లేదు. యువ హీరోలతో పాటు నటిస్తూ మల్టీ స్టారర్ చేస్తూనే ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇకపోతే ఇటీవలే తన అన్నయ్య కొడుకు రానా తో కలిసి రాణా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించాడు. నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల ఈ వెబ్ సిరీస్ విడుదలైంది. అయితే ఇక ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత వెంకటేష్ అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు.
రానా నాయుడు వెబ్ సిరీస్ లో నిజంగానే మేము చూసింది మాకు అందరికీ తెలిసిన ఫ్యామిలీ హీరో వెంకటేషేనా అనే అనుమానంలో కూడా పడిపోయారు. ఎందుకంటే వెంకటేష్ ఇప్పుడు వరకు ఎప్పుడు లేనట్లుగా తన కెరీర్ లోనే మొదటిసారి బోల్డ్ పాత్రలో నటించాడు. అయితే ఇన్నాళ్లపాటు ఇంత మంచి సినిమాలతో అలరించిన వెంకటేష్ ఇలాంటి సమయంలో ఇలాంటి బోల్డ్ పాత్రలు చేయడం అవసరమా అని అభిమానులు అనుకుంటున్న మాట. ఇక రానున్న రోజుల్లో అయినా వెంకటేష్ ఇతర ప్రాజెక్టుల ఎంపికలో జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.