ప్రస్తుతం ఉన్నా మన జనరేషన్ లో సోషల్ మీడియా కారణం గా సెలబ్రిటీల గురించిన వివరాలు తెలుసుకోవడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. ఐతే దాంట్లో భాగంగా ఒకప్పటి నటీనటులు, పాపులారిటీ సంపాదించుకుని సినిమా లకు దూరంగా ఉంటున్నవారు ఎవరైనా సరే వారి గురించి అలాగే వారు ప్రెసెంట్ ఎక్కడున్నారు, ఎం చేస్తున్నారో, వారి జీవితం ఎలా సాగుతుందో ఈజీ గా కనిపెట్టే ఛాన్సెస్ లేదా అవకాశాలు ఇపుడు మన ముందు సోషల్ మీడియా ద్వారా ఇట్టే దొరికేస్తున్నాయి.

ఐతే అలా దొరికిన ఒక హీరోయిన్ మన పవర్స్టార్ తో చేసిన చిన్ననాటి ఆర్టిస్ట్ సనుషా సంతోష్. పవన్ కళ్యాణ్ 'బంగారం' మూవీలో హీరోయిన్ చెల్లెలిగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది కేరళ కుట్టి సనుషా సంతోష్ మలయాళంతో పాటు తమిళంలోనూ బాల నటిగా ఆ తర్వాత కథానాయికగా యాక్ట్ చేసిందామె..

ఐతే ఓ కన్నడ సినిమాలో కూడా కనిపించిన సనూషా కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లో 'జీనియస్' సినిమాలో చేసింది. నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' మూవీలో తనను చూడగానే ఆడియన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు.. ఎక్కువగా మలయాళంలోనే నటిస్తు సనూషా సంతోష్ ఇన్‌స్టాగ్రామ్ ‌లో తన పర్సనల్, ప్రొఫెషనల్ అప్‌డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటుంది. తన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'బంగారం పాప ఎంత ఎదిగిపోయిందబ్బా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టింటా ప్రేక్షకులు.

ఐతే పవన్ అభిమానులు ఈ అమ్మాయి ని చూసి అప్పట్లోనే మన పవన్ కళ్యాణ్ పక్కన చేసే ఛాన్స్ దక్కించుకున్నందుకు ఆమె ను అభినందిస్తున్నారు.బంగారం మూవీ లో ఆమె చేసిన ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల గుండెలకు హత్తుకుపోయేలా ఉన్నాయని ఒకసారి గుర్తుచేసుకున్నారు. ఐతే ఈ అమ్మాయి తన దైన స్టైల్ లో ఇండస్ట్రీ లో రాణించి మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు మెగా అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: