ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాల్లో బలగం సినిమా కూడా ఒకటి. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించాడు ఆయనకు జోడిగా ఈ సినిమాలో హీరోయిన్గా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించడం జరిగింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కోటి రూపాయలు కంటే తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. తెలంగాణ గ్రామీణ సాంప్రదాయ సాంస్కృతిని ఉట్టిపడేటట్టు వెండితెర మీద ఎంతో అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. డైరెక్టర్ వేణు ఈ సినిమాను కేవలం 50 లక్షలు ఖర్చుతోనే తీశారట.

అది తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఏకంగా ఏడు కోట్ల రూపాయలకు పైగా నే వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా 10 కోట్ల రూపాయల గ్రాస్ దిశగా అడుగులో వేస్తుంది .పెట్టిన బడ్జెట్ కంటే పది రెట్లు లాభం రావడం అనేది అంత సాధారణమైన విషయం కాదు ఇలాంటి అద్భుతాలు ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన ఈ సినిమాని తమిళంలో ఒక స్టార్ హీరోతో చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి పాత్రలో కేవలం ధనుష్ కి మాత్రమే సెట్ అవుతాయి .ఈ క్రమంలోనే దిల్ రాజు ధనుష్ తో మాత్రమే ఈ సినిమా చేయాలని బలంగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు త్వరలోనే ఆయన చెన్నైకి వెళ్లి ధనుష్ కి ఈ కథని కూడా వినిపించబోతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకి కూడా డైరెక్టర్ గా వేనుని వ్యవహరిస్తాడని కూడా అంటున్నారు .ఇక్కడ ఎలాగైతే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వెండితెర మీద ఆవిష్కరించాడో తమిళ వెర్షన్ లో కూడా అక్కడి సంస్కృతిని చాటి చెబుతూ స్క్రిప్ట్ లోపలి కీలకమైన మార్పులు చేసే దిశగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇలాంటి సినిమాలు తమిళనాడులో ప్రభంజనం సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పైగా ధనుష్ లాంటి స్టార్ హీరో ఇలాంటి ఒక సినిమా చేస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయం. ఈ క్రమంలోని ఈ వార్త విన్న చాలామంది స్టార్ హీరో ధనుష్ ఇలాంటి ఒక ప్రాజెక్టు చేస్తే ఖచ్చితంగా ఆ సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది అని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: