ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆర్ఆర్‌ఆర్‌ పైనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెల్చుకోవడంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాను ఎంతగానో మెచ్చుకుంటున్నారు.ఎందరో సామాన్యుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ఈ సినిమాపై ఎన్నో రకాలుగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పార్లమెంట్లో కూడా జక్కన్నకి ప్రశంసలు దక్కాయి. ఇక ఆర్ ఆర్ ఆర్ టీం అమెరికా నుంచి రాగానే ఘనంగా సన్మానించేందుకు రెడీ అవుతున్నారు చాలామంది. ఇదిలా ఉంటే ఆస్కార్‌ అవార్డు గెలుపుతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ హీరో మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే గ్లోబల్‌ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చరణ్‌ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ ఇంకా క్రికెట్ దేవుడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి వేదిక పంచుకోనున్నారు. ప్రస్తుతం ఈ విషయం అయితే మెగా ఫ్యాన్స్‌కు ఫుల్‌ కిక్‌ ఇస్తోంది.


పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఈనెల 17,18 తేదీల్లో ఇండియా టుడే కాన్ క్లేవ్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇదే ఈవెంట్‌లో దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ ఇంకా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా పాల్గొంటున్నారు.ఇక ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో భారతీయ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింప చేసినందుకు మెగా పవర్‌స్టార్‌ని ప్రధాని మోడీ ఘనంగా సన్మానించబోతున్నారని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆర్‌ఆర్ఆర్‌ సినిమాతో గ్లోబర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్‌ ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్‌ అసోసియేషన్ అవార్డుల్లో కూడా తన సత్తాని చాటాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తన 15 వ సినిమా చేయనున్నాడు చెర్రీ.ఇందులో బాలీవుడ్ హాట్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: