రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో చిన్న సినిమా లతో కెరీర్ ను మొదలు పెట్టి మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్న మారుతీ దర్శకత్వంలో కూడా ఒక మూవీ లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితం ఎలాంటి హడా విడి లేకుండా ప్రారంభం అయింది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని షెడ్యూల్ ల షూటింగ్ కూడా ముగిసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క కొత్త షెడ్యూల్ కు సంబంధించిన ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ ఈ నెల 25 వ తేదీ నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ఈ చిత్ర బృందం ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న ప్రభాస్ హీరో గా నటిస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ లో ప్రభాస్ తరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్ లు కనిపించబోతున్నారు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ ... మాళవిక మోహన్ ... రిద్ది కుమార్ లు హీరోయిన్ లుగా కనిపించనున్నారు. అలాగే ఈ మూవీ లో ప్రభాస్ కు తాత పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో తాత పాత్ర చాలా హైలెట్ గా ఉండనున్నట్లు ... అందుకే సంజయ్ దత్ ను ఈ మూవీ లో తీసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: