కమల్ హాసన్ కి అవార్డులకు ఏమీ డోకా నే లేదు.జాతీయస్థాయిలోఅలాగే అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోకి సాధ్యపడనని అవార్డులు ను సొంతం చేసుకున్నాడు. 60 ఏళ్ళు దాటిన ఇప్పటికీ కెరియర్లో దూసుకుపోతున్నాడు.ఇంత సాధించిన అతడికి ఉన్న ఏకైక అసంతృప్తి ఒక్క ఆస్కార్ అవార్డు మాత్రమే అని తెలుస్తుంది.ఇప్పటికి తన సినిమాలో వందల కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తున్నాయి.. ఏడు, ఎనిమిది సార్లు కచ్చితంగా ఆస్కార్ లభిస్తుందని ప్రయత్నాలు చేశాడు కానీ ఏ ఒక్కటి కూడా ఆస్కార్ కి నామినేట్ కూడా కాలేదు.

ఇక చాలా మందితో పాటు కమలహాసన్ కూడా దశావతారం వంటి సినిమాకు ఆస్కార్ లభించాల్సి ఉండేది అని కూడా అనుకున్నవారే. ఈ సినిమాలో భాష బేధం, జాతి బేధం, వృత్తి బేధం, లింగ బేధం, అలాగే దేశ భేదం అనే విషయాలు అన్నీ కూడా కనిపించేలా పది పాత్రలను సెలెక్ట్ చేసుకుని ఆ అన్ని పాత్రలకు కూడా సరైన న్యాయం చేశాడని చెప్పొచ్చు.ఆ సినిమాలో అద్భుతంగా నటించాడు కమల్ హాసన్. అయినా కూడా ఈ చిత్రం కనీసం ఇండియా నుంచి ఆస్కార్ లిస్టులో కూడా వెళ్లలేదు. అంతకు ముందు కూడా అనేక సినిమాలు ఆస్కార్ కి కమలహాసన్ దరఖాస్తు చేసుకున్నా కానీ రకరకాల కారణాలతో విఫలమవుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆస్కార్ గెలవాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు.డబ్బు ఖర్చు కూడా చేయాలనే విషయం ఇప్పుడు రాజమౌళిని చూసిన తర్వాతనే తెలిసింది.

కమల్ హాసన్ తన సినిమా జీవితంలో చేసిన ప్రయోగాలు మరొక నటుడు చేయలేదని చెప్పాలి.తన జీవితంలో 19 ఫిలింఫేర్ అవార్డులు రాగా ఐదు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. తన సొంత భాషా తమిళం అయినప్పటికీ కూడా తెలుగు, హిందీ మరియు మలయాళ భాషల్లో ఎన్నో అవార్డులు పొందాడు .ఇక చాలామందికి తెలియని సంగతి ఏమిటి అంటే ఫిలింఫేర్ అవార్డులు ఇకపై నాకు ఎలాంటివి ఇవ్వద్దు అంటూ కూడా సదరు అసోసియేషన్ వారికి లేఖను కూడా కమల్ రాసారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: