టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో లలో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన సినిమా పవిత్ర బంధం ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమా లో వెంకటేష్ స్టార్టింగ్ లో కొంచం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసాడు.దింట్లో హీరోయిన్ గా సౌందర్య నటించి అందరి చేత బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు పొందింది.ఇలాంటి పాత్రలు చేయాలంటే అది సౌందర్య వల్లే అవుతుంది అని మరోసారి నిరూపించిన సినిమా ఇది.అయితే అదే టైములో ఈ సినిమా డైరెక్టర్ అయిన ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట రమ్యకృష్ణ గారిని తీసుకుందాం అనుకున్నారట కానీ చివరి నిమిషం లో సౌందర్య అయితేనే ఈ పాత్రకి బాగా సెట్ అవుతుందని అనుకొని ఆమెని తీసుకున్నారట.

ఐతే నిజంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది.కాబట్టి ఆ పాత్రకి సౌందర్య గారు మాత్రమే న్యాయం చేస్తారని ఆమెని తీసుకోవడం నిజంగా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది ఆమెని చూసిన ప్రతి ఒక్క భార్య తనని తాను గుర్తుచేసుకుంది అంటే ఆమె ఆ పాత్రలో ఎంత ఇన్వాల్వ్ అయి నటించిందో మనం అర్థం చేసుకోవచ్చు.సౌందర్య తెలుగులో ఉన్న అందరి హీరోలతో నటించి మంచి పేరు సంపాదించుకుంది.అంత మంచి నటి అయిన ఆమె చాలా తొందరగానే మనల్ని అందరిని వదిలేసి అనంతలోకాలకు వెళ్లిపోవడం నిజంగా మనకు భాదను కల్గించే విషయం అనే చెప్పాలి.ఆమె చేసిన సినిమాల వాళ్ల ఆమెకి ఏర్పడిన అభిమానులు ఆమెను వాళ్ల గుండెల్లో పెట్టుకున్నారు అందుకే ఆమె లేదు అనే చేదు వార్తను వినలేకపోయారు మొత్తానికి సౌందర్య గారి లాంటి మంచి నటి ఇండస్ట్రీ లో ఇంకొకరు లేరు మళ్ళీ రారు అనే చెప్పాలి.

ఏదేమైనా ఇలాంటి సినిమా మిస్ చేసుకున్నందుకు ఆమె బాధ పడ్డట్టు ఒకసారి ముఖముఖి సంభాషణలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: