అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని మొదటి భాగానికంటే ఎక్కువగా చాలా అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం స్క్రిప్ట్ పైన కూడా చాలా రోజుల నుంచి ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫైనల్ గా రెండు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నది ఈసారి ఇండియన్ ఫారెస్టులతో పాటు ఫారెన్ లోకేషన్ లో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు సుకుమార్.పుష్ప-2 లో అల్లు అర్జున్ లుక్కుని రీచ్ గా డిజైన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్మగ్లర్గా డాన్ పాత్రలో అల్లు అర్జున్ పాత్ర ఉండబోతోందని సమాచారం. ఇందుకోసం అతని కాస్ట్యూమ్స్ లుక్స్ అన్నిటిని కూడా ప్రత్యేకంగా కనిపించే విధంగా సుకుమార్ శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ కూడా మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది చైనాలో రికార్డింగ్ థియేటర్లు మ్యూజిక్ సిట్టింగ్ జరిగినట్లు సమాచారం.


దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ ఇద్దరు కూడా మ్యూజిక్ సిటింగ్ లో ఉన్నారని ఇక త్వరలోనే అల్లు అర్జున్ కూడా వీరితో కలవబోతున్నట్లు సమాచారం. పుష్ప సాంగ్ దేశవ్యాప్తంగా కూడా పెను సెన్సేషనల్ సృష్టించింది గత ఏడాది మొత్తం ఈ సాంగ్ పాపులర్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మొదటి సినిమాను మించి ఈసారి పాటలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప టు నుంచి ఫస్ట్ లుక్ టీజర్ లేదా గ్లింప్స్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పుష్ప-2 సినిమాని మాత్రం ఈసారి మరింతగా తీర్చిదిద్దు పోతున్నారు సుకుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: