టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా పిలవబడే నాని  తాజాగా దసరా మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ క్యారెక్టర్లు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఇక ఈ సినిమాలో నాని సరసన నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమా మార్చి 30 తేదీ విడుదల కానుంది. ఇలా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఐతే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాని దసరా సినిమాలోని ఒక సన్నివేశం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఇందులో తాను ఒక సన్నివేశంలో నటించి దాదాపు రెండు నెలలుగా ఆ సంఘటన నుంచి బయటకు రాలేకపోయానని సరిగా నిద్ర కూడా పట్టలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగా డంపర్ ట్రక్ బొగ్గును తీసుకెళ్లి డప్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ సన్నివేశంలో తాను డంపర్ ట్రక్ నుంచి కింద పడగా తనపై బొగ్గు పడే సన్నివేశం చేయాల్సి వచ్చింది. ఇలా ఈ సన్నివేశం కోసం సిలికాన్ బొగ్గు తయారు చేశారు. అయితే అది పూర్తిగా డస్ట్ పట్టి ఉంది అయితే ఈ సన్నివేశం చేసే సమయంలో తాను డంపర్ ట్రక్ నుంచి కింద పడిపోగా బొగ్గు తనపై పడి తనని అందులో నుంచి పైకి తీసుకురావాలి అంటే ఈ గ్యాప్ లో కాస్త సమయం పడుతుంది.ఆ సమయంలో తాను శ్వాస తీసుకోకుండా ఉన్నాను ఒకవేళ శ్వాస తీసుకుంటే ఆ డస్ట్ మొత్తం లోపలికి పోతుంది. ఆ సమయంలో కాస్త ఇబ్బంది పడ్డానని అయితే సన్నివేశం పూర్తయిన రెండు నెలల వరకు తనకు ఆ భయం పోలేదని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: