మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా రవితేజ పోయిన సంవత్సరం ఖి , రామారావు ఆన్ డ్యూటీ , ధమాకా అనే మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ధమాకా మూవీ మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే రవితేజ "వాల్టేరు వీరయ్య" అనే మూవీ లో కీలక పాత్రలో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో రవితేజ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ ఈ సినిమా విజయంలో మాత్రం రవితేజ పాత్ర చాలా కీలక పాత్రను పోషించింది. 

ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ తో ప్రేక్షకులను అలరించిన రవితేజ మరి కొన్ని రోజుల్లో రావణాసుర మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. రావణాసుర మూవీ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. అను ఇమాన్యుల్ ,  మేఘ ఆకాష్ , ద్రాక్ష నాగర్కర్ , పూజిత పన్నోడ , ఫరియా అబ్దుల్లా ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి ఈ చిత్రం బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా బృందం ప్రమోషన్ లను ఇప్పటికే మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే రవితేజ ... నాని తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే ఈ మూవీ యూనిట్ లోకి సభ్యులు అంతా కలిసి మరో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ఉగాది సందర్భంగా విడుదల కానున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: