కొన్ని కొన్ని సందర్భాలలో ఒకే సారి అనేక క్రేజీ మూవీ లు థియేటర్ లలో విడుదల అవుతూ ఉంటాయి. అలా ఒకే సారి అనేక క్రేజీ మూవీలు థియేటర్ లలో విడుదల కావడం వల్ల అన్ని సినిమా కలెక్షన్ లపై కూడా ఎంతో కొంత ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. అందులో కొంత బాగాలేని సినిమాకు కూడా చాలా తక్కువ కలెక్షన్ లు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానితో సినిమా మేకర్ లు కూడా భారీ క్రేజ్ ఉన్న సినిమాలను కనీసం వారం రోజుల వ్యవధితోనే విడుదల చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సందర్భలలో భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే సారి విడుదల అవుతూ ఉంటాయి.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఆగస్టు నెలలో కూడా ఈ పరిస్థితులు కనబడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందుతున్న యానిమల్ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ మూవీ ని కూడా ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ని కూడా ఆగస్టు నెలలో విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ మూవీ ని కూడా ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనితో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ యుద్ధమే జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: