ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం నటించిన పుష్ప ది రైస్ మూవీ తో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటన కు కాను దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు.

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ఈ మూవీ లో ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ మూవీ రెండవ భాగం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ రెండవ భాగం పుష్ప ది రూల్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

 ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ నుండి ఒక యాక్షన్ వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో ఒక అద్భుతమైన పాత్ర ఉండబోతున్నట్లు ఆ పాత్ర కోసం ఈ చిత్రం బృందం బాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ నటిని తీసుకునే ఆలోచనలు చేస్తున్నట్లు ... ఆ నటి ఎవరు అనేది మరి కొద్ది రోజుల్లోనే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: