తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో సుకుమార్ ఒకరు. ఈ దర్శకుడు అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య సినిమాతో దర్శకుడు గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో దర్శకుడు గా సుకుమార్ కు ఈ మూవీ ద్వారా అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి ... విమర్శకులు నుండి లభించాయి. ఆ తర్వాత ఈ దర్శకుడు అనేక మూవీ లకు దర్శకత్వం వహించాడు. అందులో సుకుమార్ దర్శకత్వం వహించిన చాలా వరకు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించాయి.

కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను సాధించక పోయినప్పటికీ ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ప్రశంసలను మాత్రం బాగానే అందుకున్నాయి. ఇలా ఇప్పటికే దర్శకుడుగా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు పుష్ప ది రూల్ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది ఇలా అంటే చాలా రోజుల క్రితమే సుకుమార్ ... విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఒక మూవీ ఉండబోతున్నట్లు ప్రకటన వచ్చిన విషయం మనకు తెలిసింది. పుష్ప ది రూల్ ఈ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ తో సుకుమార్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే సుకుమార్ తన తదుపరి మూవీ ని విజయ్ దేవరకొండ తో చేసే అవకాశాలు చాలా వరకు లేవు అని వార్తలు వస్తున్నాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుందో ... లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: