
ఇక ఆ తర్వాత బాలీవుడ్ లోనే కాస్త ఎక్కువ సినిమాలు చేసింది అని చెప్పాలి. అయితే టాలీవుడ్ లో మాత్రం రామ్ చరణ్ తో సినిమా తర్వాత ఎప్పుడు కనిపించలేదు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మాత్రం ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఇక తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఎన్నో ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్ర కారు మతిపోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇప్పుడు ఈ రాంచరణ్ హీరోయిన్ కాస్త ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
కొత్త కారుకు వెల్కమ్ చెబుతూ తన సోదరి ఐషా శర్మతో ఉన్న వీడియోని ట్విటర్లో షేర్ చేసింది నేహా శర్మ. అయితే ఈ కారు విలువ దాదాపు 1.09 కోట్ల వరకు ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఇక ఈ కార్ వీడియోని పోస్ట్ చేస్తూ.. మనం కష్టపడి పని చేస్తూనే ఉంటాము.. భగవంతుడు మన పట్ల ఎప్పుడు దయతోనే ఉంటాడు. మనం కూడా దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి అంటూ ఒక కామెంట్ కూడా రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ హీరోయిన్ త్వరలోనే నవాజుద్దీన్ సిద్ధికి సరసన జోగీరా సారా రా అని సినిమాలో నటించబోతుంది అని చెప్పాలి. ఈ సినిమాలో సంజయ్ మిశ్రా, మహా అక్షయ్ చక్రవర్తి నటిస్తున్నారు. కుషన్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.