కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.. తాజాగా నటుడు విశాల్  కు హైకోర్టు షాక్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. లైకా ప్రొడక్షన్ తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన తమిళ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. దాదాపుగా 15 కోట్ల రూపాయల శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ ను మూడు వారాల లోపు చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం.


అసలు విషయంలోకి వెళ్తే ప్రముఖ నిర్మాత ఫైనాన్షియర్ అన్షుచలియన్ నుంచీ విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ కోసం రూ.21.29 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారని ఈ రుణాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ కు ఫైనాన్షియర్ కు తిరిగి చెల్లించాలని అయితే తమకు రుణం చెల్లించ నందువలన విశాల్ నటించిన చిత్రాల పంపిణీ హక్కులను తమకే ఇచ్చేలా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ లేక ప్రొడక్షన్ మధ్య ఒక ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.


ఈ ఒప్పందాన్ని హీరో విశాల్ ఉల్లంఘించడంతో తమిళనాట పెద్ద రచ్చగా మారుతోంది..రీసెంట్గా విశాల్ ఈ ఒప్పందం మీద తన చిత్రం వీరమే వాగై సుడం అనే చిత్రాన్ని విడుదల చేశారు. దీంతో లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ హైకోర్టు రిజిస్ట్రేషన్ పేరుతో ఉన్న 15 కోట్ల రూపాయలను మూడు వారాల లోపు డిపాజిట్ చేయాలని ఆదేశించింది.. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టులో అపీల్ చేయగా దీనిపైన ప్రధాన న్యాయమూర్తులు ధర్మాసనం విచారణ జరపాలని స్పెషల్ కోర్టు నుంచి ఉత్తర్వులు సమర్ధించింది. దీనిపైన విచారణ వచ్చేంతవరకు విశాల్ నటించిన సినిమాలు థియేటర్ లేదా ఓటీడీలలో విడుదల చేయడానికి వీలులేదని ధర్మాసనం తెలియ జేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: