ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప2' గత ఏడాది విడుదలైన పుష్ప ది రైజ్ చిత్రానికి ఇది సీక్వెల్ గా రూపొందుతోంది. ఇక పార్ట్ వన్ సంచలన విజయాన్ని అందుకోవడంతో పార్ట్ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప2  ఉండబోతుందని ఇటీవల టీజర్ తోనే హింట్ ఇచ్చాడు. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్పం 2 టీజర్ భారీ రికార్డ్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ ఈ టీజర్ అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో బన్నీ మరోసారి తన మెకోవర్, లుక్స్ తో మ్యాజిక్ చేయబోతున్నాడు. 

మొదటి భాగంలోనే పుష్పరాజ్ పాత్ర కోసం బన్నీ ఎంతలా కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పార్ట్ 2 కోసం కూడా బన్నీ అంతకుమించి కష్టపడుతున్నాడట. ముఖ్యంగా డైట్ విషయంలో బన్నీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇందుకోసం స్పెషల్ గా ఓ సపరేట్ డైటీషియన్ ని అపాయింట్ చేసుకొని మరీ డైట్ ని ఫాలో అవుతున్నాడట. ముఖ్యంగా సినిమాలో మాస్ బాడీ లాంగ్వేజ్ ను ఎలివేట్ చేసే విధంగా సుకుమార్ సీన్స్ డిజైన్ చేయడంతో బన్నీ ఆ సీన్స్ కి ప్రాణం పెట్టి మరి నటిస్తున్నాడట. తన కెరీర్ కు ఎంతో ప్లస్ అయ్యే పుష్ప2 కోసం ప్రత్యేకంగా బన్నీ ఫుడ్ డైట్ ను ఫాలో అవుతున్నారట.

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు డైటీషియన్ చెప్పిన ఫుడ్ ని తీసుకుంటూ కష్టపడుతున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. నిజానికి బన్నీ మంచి పుడీ అయినా కూడా సినిమా కోసం నోరు కట్టేసుకుని మరి డైట్ ని ఫాలో అవుతున్నాడట. దీంతో బన్నీ డెడికేషన్ కి ఫ్యాన్స్ నేటిజన్స్సైతం ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా పుష్ప2 రిలీజ్ తర్వాత నువ్వు మిస్ అయిన ఫుడ్ మొత్తాన్ని కుమ్మేయ్ అన్న అంటూ బన్నీకి సజెషన్స్ ఇస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరి కల్లా సినిమాను విడుదల చేయాలని మేకర్ సన్నాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: