మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ పాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాలో శృతి హాసన్ ... చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించగా ... ప్రకాష్ రాజ్ ... బాబి సింహమూవీ లో విలన్ పాత్రలలో నటించారు. రవితేజ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ లో కేథరిన్ ... రవితేజ కు భార్య పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి "భోళా శంకర్" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ తర్వాత చిరంజీవి తన తదుపరి మూవీ ని ఇప్పటి వరకు ప్రకటించ లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి తన నెక్స్ట్ మూవీ కోసం కథలను వింటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే చిరంజీవి కి అనేక మంది కథలు వినిపించినట్లుగా ... అందులో కొన్ని కథలను డెవలప్ చేయమని చిరంజీవి చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే చిరంజీవి కి ఇప్పటి వరకు తన నెక్స్ట్ మూవీ కోసం ఎంత మంది కథలను వినిపించారో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" సినిమా తర్వాత సినిమా కోసం బి వి ఎస్ రవి ఒక కథను వినిపించగా ... మల్లాడి వశిష్ట ఒక కథను వినిపించాడట. కళ్యాణ్ కృష్ణ రెండు కథలను వినిపించగా ... బెజవాడ ప్రసన్న కూడా కొన్ని కథలను వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథలలో చిరంజీవి తన నెక్స్ట్ మూవీకి ఏదో ఒక కథను సెలెక్ట్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: