టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి నటుడి గా గుర్తింపును తెచ్చుకొని సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటున్న యువ హీరో లలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ యువ నటుడు కొంత కాలం క్రితం ఓరి దేవుడా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఆశ్విత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతోంది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ త్వరలో జెమిని టీవీ లో ప్రసారం కానుంది. మరి ఇప్పటికే థియేటర్ లలో డీసెంట్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా బుల్లి తెరపై ప్రేక్షకులను మేరకు అలరిస్తుందో చూడాలి. మిథిలా పాల్కర్ ,ఆశా భట్ ఈ మూవీ లో లేడీ లీడ్ రోల్స్ లో నటించారు.

లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఓరి దేవుడా మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్న విశ్వక్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విశ్వక్ దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. నివేత పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: