టాలీవుడ్ సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ సోషల్ మీడియాల లో ఒకటైన ట్విట్టర్ ద్వారా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విశేషాలతో పాటు సినిమాలకు సంబంధించిన విశేషాలను సైతం పంచుకుంటున్నారు.

కొంతమంది సినీ సెలబ్రిటీలకు ఊహించని స్థాయి లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్ ను ఉపయోగించే సెలబ్రిటీల సంఖ్య సైతం పెరుగుతోంది. 

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సినీ ప్రముఖుల కు ట్విట్టర్ షాకిచ్చింది. సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు చెల్లించని సెలబ్రిటీల బ్లూ టిక్స్ ను ట్విట్టర్ తొలగించింది. నెలవారీ లేదా ఏడాది చందా చెల్లించిన వాళ్లకు మాత్రమే ప్రస్తుతం బ్లూ టిక్స్ ఉన్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగచైతన్య, అఖిల్, వెంకటేశ్, మోహన్ బాబు, నితిన్, ప్రకాష్ రాజ్, మంచు మనోజ్ బ్లూ టిక్ ను కోల్పోయారు. 

హీరోయిన్ల విషయానికి వస్తే సమంత, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, పూజా హెగ్డే బ్లూ టిక్ ను కోల్పోయారు. అయితే కొంతమంది సెలబ్రిటీల బ్లూ టిక్స్ మాత్రం అలానే ఉన్నాయి. బ్లూ టిక్స్ ఉన్న సెలబ్రిటీల జాబితాలో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మంచు విష్ణు ఉన్నారు. కోలీవుడ్, బాలీవుడ్ టాప్ స్టార్స్ సైతం బ్లూ టిక్ కోల్పోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. 

ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ చెప్పిందే చేశాడని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జగన్, చంద్రబాబు నాయుడు కూడా బ్లూ టిక్ కోల్పోవడం హాట్ టాపిక్ అవుతోంది. పలు మీడియా సంస్థలు సైతం బ్లూ టిక్ ను కోల్పోవడం సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. బ్లూ టిక్స్ ను తొలగించడంపై ట్విట్టర్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: