మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరుపాక్ష సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మంచి భారీ వసూళ్లను సాధిస్తుంది అని చెప్పాలి. ఇక వీకెండ్ కావడంతో ఈ సినిమా రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటేసింది. 22.20 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన విరుపాక్ష ఇటీవల వసూళ్ల లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఈ సినిమా లోని డిఫరెంట్ కాన్సెప్ట్ చూసి ప్రేక్షకులు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక సినిమా లోని ట్విస్టు లు ప్రేక్షకులను ముని వేళ్ళపై నిలబెడుతున్నాయి అని చెప్పాలి.



 ఈ మధ్య కాలంలో అయితే ఈ స్థాయి హర్రర్ త్రిల్లర్ సినిమా ప్రేక్షకులు చూసి ఉండరు అని చెప్పడం లోనూ అతిశయోక్తి లేదు. ఈ సినిమాకు సుకుమార్ అందించిన స్క్రీన్ ప్లే, ఇక సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు డైరెక్షన్ కీలక పాత్ర పోషించాయి.  ఇలా యాక్సిడెంట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని వచ్చిన సాయి ధరంతేజ్ కి ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే రెండు వారాల క్రితం భారీ అంచనాల తో విడుదలైన రావణాసుర సినిమా మాత్రం చివరికి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.



 అయితే రావణాసుర సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చకపోవడానికి కథ కథనం ఆసక్తికరంగా లేకపోవడమే కారణం అన్నది తెలుస్తుంది. ఇలా కథలో బలం లేకపోవడం కారణంగానే రవితేజ నటించిన రావణాసుర హిట్ అయిందని.. అదే కథ బాగుంది. ఇక ఊహించని మలుపులు ఉండడమే అటు విరుపాక్ష సినిమాకు సినిమాకు ప్లస్ అయిందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక విరుపాక్ష తరహాలోనే రాబోయే సినిమాల విషయంలో కూడా సాయిధరమ్ తేజ్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిమానులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: