టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరో లలో ఒకరు అయినటు వంటి విశ్వక్ సేన్ ఈ మధ్య వరుస మూవీ లతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తున్నాడు. తాజాగా ఈ యువ హీరో దాస్ కా దమ్కి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి విశ్వక్ దర్శకత్వం కూడా వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో నివేత పేతురాజ్ ... విశ్వక్ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ లో విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటించి రెండు పాత్రల్లోనూ తన నటన తో ప్రేక్షకులను ... విమర్శకులను బాగానే మెప్పించాడు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే దాస్ కా దమ్కి మూవీ కి పార్ట్ 2 ను కూడా రూపొందించ బోతున్నట్లు ఈ యువ హీరో కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాడు. దాస్ కా దమ్కి మూవీ మంచి విజయం సాధించడంతో దాస్ కా దమ్కి పార్ట్ 2 పై ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విశ్వక్ తన తదుపరి మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో చేయబోతున్నాడు. ఈ బ్యానర్ లో విశ్వక్ హీరో గా నటించబోయే సినిమా రేపటి నుండి రామానాయుడు స్టూడియో లో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరి కొన్ని రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: