అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం 'ఏజెంట్' మూవీ ప్రమోషన్స్ తో తెగ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్పై థ్రిలర్గా తెరకెక్కిన ఈ మూవీని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ మమ్ముట్టి ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో అఖిల్ కి ఓ ప్రశ్న ఎదురయింది. ట్రిపులర్ వంటి ఆస్కార్ విన్నింగ్ మూవీ ని డైరెక్ట్ చేసిన రాజమౌళి తన తదుపరిచిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ని అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా రాజమౌళి రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ వెళ్లనుంది.

అయితే ఈ సినిమాలో రాజమౌళి గారు మీకు ఓ మంచి రోల్ ఇస్తే చేస్తారా? అని యాంకర్ అఖిల్ ని ప్రశ్నించింది. ఇక ఆ ప్రశ్నకు అఖిల్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. 'ఊహాగానాల గురించి ఇప్పుడు ఎందుకు చెప్పండి' అంటూ యాంకర్ కి కౌంటర్ ఇస్తూనే..' మహేష్ రాజమౌళి నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటివారు. రాజమౌళి మూవీలో ఛాన్స్ వసస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి' అంటూ అఖిల్ సమాధానం ఇచ్చాడు. మొత్తానికి రాజమౌళి మహేష్ మూవీలో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తానని అఖిల్ చెప్పడంతో  అఖిల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రాజమౌళి, మహేష్ మూవీ లో కాకపోయినా ఫ్యూచర్లో రాజమౌళితో అఖిల్ సినిమా చేస్తే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ ఈ సందర్భంగా కోరుకుంటున్నారు.

ఇక కొన్ని సంవత్సరాల నుండి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కోసం ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు అఖిల్. అయితే ఈసారి ఏజెంట్ ద్వారా అఖిల్ కష్టానికి తగ్గ ఫలితం దక్కే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకుంది. అందులోనూ ఇది స్పై థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ కోసం అఖిల్ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ని కంప్లీట్ మార్చేశాడు. ఇప్పటివరకు ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ తో పాటు మంచి హైప్ కూడా క్రియేట్ అయ్యింది. కాబట్టి ఏజెంట్ అఖిల్ సాలిడ్ హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ సైతం ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి అఖిల్ కి ఏజెంట్ ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: