ఇటీవల పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు బన్నీ. అయితే తాజాగా బన్నీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే లవర్ బాయ్ నితిన్ వల్ల అల్లు అర్జున్ స్టార్ హీరో అయ్యాడట. అది ఎలా అని అనుకుంటున్నారా? సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఓ చిన్న సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. ఆ సినిమా వల్ల చిన్న హీరో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోవచ్చు. అలా మన అల్లు అర్జున్ ని కెరీర్ బిగినింగ్ లో స్టార్ హీరోగా మార్చిన మూవీ 'ఆర్య'. ఈ మూవీ అప్పట్లో యూత్ నీ విపరీతంగా ఆకట్టుకుంది. 

ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే సుకుమార్ వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమా స్టోరీ ని ముందుగా నితిన్ కి వినిపించాడట సుకుమార్. నితిన్ అయితేనే ఈ స్టోరీ కి పర్ఫెక్ట్ అని అనుకున్నాడట. కానీ నితిన్ ఆ సమయంలో దిల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ వెళ్లి నితిన్ కి కథ వినిపించగా.. కథ విన్న తర్వాత సెకండ్ హాఫ్ బాలేదని నితిన్ రిజెక్ట్ చేశాడట. దాంతో ఈ కథను దిల్ రాజుకు వినిపించాడు సుకుమార్. అప్పుడు హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆ సమయంలో దిల్ సినిమాను టాలీవుడ్ హీరోల కోసం స్పెషల్ షో వేశారు. అప్పుడే సుకుమార్ అల్లు అర్జున్ ని చూసాడు.

దాంతో బన్నీనే తన సినిమాకు పర్ఫెక్ట్ అని డిసైడ్ అయిపోయాడు. వెంటనే చిరంజీవి, అల్లు అరవింద్ లకు కథ చెప్పగా వాళ్ళు ఓకే చేసేసారు. అలా వచ్చిన ఆర్య సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక కొత్త ట్రెండును సెట్ చేసింది. ఈ సినిమా దెబ్బతో అల్లు అర్జున్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆర్య సక్సెస్ తో బన్నీకి యూత్లో ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. అక్కడి నుంచి తన జర్నీ ని మొదలుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు బన్నీ. సో ఆరోజు నితిన్ కనుక ఆర్య మూవీ ని ఓకే చేసి ఉండుంటే బన్నీకి అంత తొందరగా స్టార్ డం వచ్చేది కాదు. అలా నితిన్ ఆర్య మూవీని వదులుకోవడంతో అల్లు అర్జున్సినిమా ద్వారా స్టార్ హీరో అయ్యాడన్నమాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: