సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరు అయినటు వంటి శంకర్ దర్శకత్వంలో రూపొందినటు వంటి రోబో సినిమా ఏ రేంజ్ విజయం అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ 2 అక్టోబర్ 2010 సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 31.60 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఆ తర్వాత కూడా ఈ మూవీ కి అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఈ మూవీ చివరగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే రోబో మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత ఈ మూవీ కి సీక్వెల్ గా శంకర్ ... రజనీ కాంత్ హీరో గా రోబో 2.0 అనే మూవీ ని రూపొందించాడు.

ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీ  29 నవంబర్ 2018 వ సంవత్సరం ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా రోబో మూవీ మొదటి పార్ట్ తో పోలిస్తే రెండవ పార్ట్ అత్యంత భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: