ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందినటువంటి గంగోత్రి మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందినటు వంటి ఆర్య మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకొని తన క్రేజ్ ను మరింత గా పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించాడు.

అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయవంతం అయిన సినిమాలలో పరుగు సినిమా ఒకటి. ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన షీలా హీరోయిన్ గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా ... ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మంచి అంచనాల నడుమ 1 మే 2008 వ సంవత్సరం విడుదల అయింది.

సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లు కూడా లభించాయి. చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీ గా నిలిచింది. ఇలా ఆ కాలంలో అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా విడుదల అయ్యి నేటితో 15 ఏళ్లు పూర్తి అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: