త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. నిన్ను చూడాలి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఎన్టీఆర్.మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోకపోయినప్పటికీ ఆ సినిమా తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.ఆయన సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో ఉన్నాయి. ఇక అలాంటి ఈ హీరో నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా తన సొంతంగా స్టార్ హీరో స్టేటస్ను దక్కించుకున్నాడు.  ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ హీరోలలో ఒకరిగా చలామణి అవుతున్నాడు. 

అయితే జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి హీరోగా. పరిచయమై దాదాపుగా రెండు దశాబ్దాలు దాటింది అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ .ఇదిలా ఉంటే ఇక ఈ రెండు దశాబ్దలసిని కెరియర్లో ఆస్తులను కూడా బాగానే కూడా పెట్టాడట ఎన్టీఆర్. తాజాగా అందిస్తున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ ఆస్తులు విలువ దాదాపుగా 450 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ప్రస్తుతం సౌత్ హీరోలలో అత్యధిక రెమ్యూనికేషన్ తీసుకుంటున్న హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఆస్తులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..హైదరాబాదులో జూనియర్ ఎన్టీఆర్ ఒక విలాసవంతమైన బంగ్లాలో ఉంటున్నాడు.

ఇక దాని విలువ 25 కోట్లకు పై మాటే.. దాంతోపాటుగా 80 కోట్లు విలువ చేసే ప్రైవేట్ జెట్ కూడా ఉంది .దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ వాడే వాచ్ ల విలువ కూడా కోట్లలోనే ఉంటుంది. వాచ్ లతో పాటు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కోట్లల్లో ఖరీ దు విలువచేసే కార్లు కూడా ఉన్నాయి. లంబోర్ఘిని, bmw, బెంజ్ ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల కార్స్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్నాయి. అయితే దాదాపుగా ఈ కార్ల విలువ 15 కోట్లకు పైగానే ఉంటుందట. వీటితోపాటు జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఎన్నో ఆస్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ ఆస్తి విలువ దాదాపుగా 450 కోట్లకు పైగానే ఉంటుంది. ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30  సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: